Homeహైదరాబాద్latest Newsఆయిల్ పామ్ సాగు లో ఆంధ్ర టాప్.. అత్యధికంగా 1,84,640 హెక్టార్లలో..!

ఆయిల్ పామ్ సాగు లో ఆంధ్ర టాప్.. అత్యధికంగా 1,84,640 హెక్టార్లలో..!

ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. నూనెగింజల ఉత్పత్తి రాష్ట్రాలపై నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక దేశంలోనే ఆయిల్ పామ్ సాగులో వృద్ధికి ఏపీ తన బెంచ్ మార్క్ అని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. తొమ్మిది రాష్ట్రాలు దేశంలోని మొత్తం నూనెగింజల విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. ఆయిల్‌పామ్‌ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ టాప్ లో ఉన్నాయి. దేశంలో మొత్తం ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం 3,70,028 హెక్టార్లు కాగా, ఇందులో ఏపీ అత్యధికంగా 1,84,640 హెక్టార్లలో సాగుతోందని వివరించింది. ఆయిల్‌పామ్‌ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ టాప్ లో ఉన్నాయి. దేశంలో మొత్తం ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం 3,70,028 హెక్టార్లు కాగా, ఇందులో ఏపీ అత్యధికంగా 1,84,640 హెక్టార్లలో సాగుతోందని వివరించింది. దేశంలో 3,60,729 టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి జరుగుతోందని, ఇందులో ఏపీలో అత్యధికంగా 2,95,075 టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి జరుగుతోందని, తెలంగాణ, కర్ణాటక, మిజోరాం ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది.

spot_img

Recent

- Advertisment -spot_img