Homeహైదరాబాద్latest Newsనటి హేమకు సపోర్ట్ చేస్తోన్న ఆంధ్ర పొలిటిషియన్స్

నటి హేమకు సపోర్ట్ చేస్తోన్న ఆంధ్ర పొలిటిషియన్స్

రేవ్‌ పార్టీలో తెలుగు నటి హేమ డ్రగ్స్‌ సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసు అధికారులు అంటున్నారు. దీంతో బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణకు హాజరు కావాలని హేమకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. హేమకు నోటీసులు జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కొందరు బెంగళూరు సీసీబీ పోలీసులకు పదే పదే ఫోన్లు చేస్తున్నారని ఓ పోలీస్ అధికారి కన్నడ మీడియాకు తెలియజేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదే విధంగా హేమను అరెస్ట్ చేయవద్దని, ఆమెను విచారణ చేసి వదిలేయాలని బెంగళూరు సీసీబీ పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారని కన్నడ మీడియా తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

Recent

- Advertisment -spot_img