Andhra Pradesh : ఏపీ (Andhra Pradesh) ప్రభుత్వం కరువు పీడిత మండలాలను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 6 జిల్లాల్లో 51 కరువు పీడిత మండలాలను గుర్తించినట్లు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ 51 కరువు పీడిత మండలాలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం మరియు వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. కరువు నిర్వహణ మాన్యువల్ ప్రకారం, రైతులకు అవసరమైన సహాయం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అవసరమైన నిధులు, సబ్సిడీలు మరియు సహాయ కార్యక్రమాలను అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తోందని రెవెన్యూ ప్రత్యేక తెలిపారు.