Homeహైదరాబాద్latest Newsవిదేశీ మద్యం బాటిళ్ల ధరలపై… ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చట్ట సవరణ

విదేశీ మద్యం బాటిళ్ల ధరలపై… ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చట్ట సవరణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా రెండు రోజుల్లో ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ద్వారా ప్రభుత్వానికి సుమారు 17 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కొత్త ప్రైవేట్ వైన్ షాపులు అందుబాటులోకి రానున్న దృష్ట్యా, దేశంలో తయారయ్యే విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. ఈ మేరకు అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అదనపు ప్రివిలేజ్ ఫీజును చిల్లర కాకుండా వచ్చే పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. దీంతో ఎంఆర్ పీ ధర రూ.150.50కి మించి ఉంటే రూ.160కి పెంచేందుకు అదనపు ప్రివిలేజ్ ఫీజు ఉంటుంది. రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Recent

- Advertisment -spot_img