ఇదేనిజం మంథని: ప్రభుత్వం ఇటీవల చేపడుతున్న సంస్కరణల కారణంగా అంగన్వాడి కేంద్రాలకు నూతన శోభ సంతరించుకుంటుందని.ఈ విద్యా సంవత్సరం నుండి నూతనంగా అంగన్వాడి కేంద్రాల్లో 3-6 ఏండ్ల వయసు ఉన్న వారికి పూర్వ ప్రాథమిక విద్యను అందించనున్నారని సిడిపిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎంపీపీ కొండా శంకర్ తెలిపారు. అంగన్వాడి కేంద్రంలోని పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలని ఆటపాటలతో అర్థమయ్యే విధంగా బోధన చేయాలని అన్నారు.ప్రభుత్వ నిబంధనలో మేరకు అది ఒక్కరూ విధులపై బాధ్యతగా సమయపాలన పాటిస్తూ ప్రణాళికతో అంగన్వాడి కేంద్రాల నిర్వహణను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పేంద్రు రమాదేవి సింగిల్ విండో చైర్మన్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ సీపతి బాణయ్య కౌన్సిలర్ నక్క నాగేంద్ర శంకర్, సిడిపిఓ స్వరూప,కాంగ్రెస్ నాయకులు , పోషణ అభియాన్ కోఆర్డినేటర్ అనిల్, సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాల్గొన్నారు