రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషా దేవి గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మికి 80,948 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి శిరీషకు 90,087 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థిపై శిరీష 9,139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసీపీ కంచుకోటను బద్దలుగొట్టడమే కాకుండా మరో రికార్డు సృష్టించారు. గతంలో శిరీష అంగన్‌వాడీ టీచర్‌గా చేయగా, ఇప్పుడే ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లనున్నారు.