ఇదే నిజం, ధర్మపురి టౌన్: ధర్మపురి మండల కేంద్రంలోనీ స్థానిక SC హస్టల్లో శనివారం రోజున నిర్వహించిన అంగన్వాడీ టీచర్స్ రివైజ్డ్ ప్రీస్కూల్ ట్రైనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అంగన్వాడి ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ధర్నాలు నిర్వహించినప్పుడు ఒక అన్నగా వారి వెంట ఉంటూ వారికి మద్దతు తెలుపుతూ వారి పక్షాన ఉండి పోరాటం చేయడం జరిగిందని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం వారి న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మరియు సంబంధిత శాఖ మంత్రిదృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్ళగలిగే వారదులు అంగన్వాడి టీచర్లనీ,త్వరలోనే అంగన్వాడి ఉద్యోగులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటానని, గ్రామ గ్రామాన అంగన్వాడీ ఉద్యోగులకు ఎటువంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.