Anganwadi: అంగన్వాడీ చిన్నారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు అంగన్వాడీల్లో ఇచ్చే బాలామృతాన్ని వారానికి 3, 4 ఫ్లేవర్లలో అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రోజూ ఒకే రకమైనది ఇవ్వడంతో చిన్నారులు తినడం లేదని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏమేం కలపాలన్న దానిపై అధికారుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోనుంది. కాగా రాష్ట్రంలో 10 లక్షల మంది చిన్నారులకు సర్కార్ బాలామృతాన్ని ఉచితంగా అందిస్తోంది.