ముంబాయి: తన వద్ద ఒక్క పైసా లేదని.. నగలు అమ్మి లాయర్ ఫీజు చెల్లించానని అనిల్ అంబానీ బ్రిటన్ కోర్టుకు తెలియజేశారు. ఖరీదైన రోల్స్ రాయిస్ కారు లేదని, ఇది మీడియా ప్రచారమేనని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం బ్రిటన్ కోర్టు ముందు హాజరయ్యారు. తన తల్లికి రూ.500 కోట్లు, కుమారుడు అన్‌మోల్‌కు రూ.310 కోట్ల రుణాలు ఉన్నట్లు తెలియజేశారు.
మూడు చైనా బ్యాంకుల అనిల్ అంబానీ రుణాలు తీసుకోని వాటిని తిరిగి చెల్లిండంలో విఫలమయ్యారు. దీంతో చైనా బ్యాంకులు బ్రిటన్ కోర్టును ఆశ్రయించాయి. 2020 జూన్ 12లోగా 716,917,681 డాలర్లు (రూ.5,281 కోట్లు), కోర్టు ఖర్చుల కింద 75,000 యూరోలు (రూ.7కోట్లు) చెల్లించాలని మే 22న బ్రిటన్ హైకోర్టు అనిల్ అంబానీని ఆదేశించింది. అయితే గడువులోగా ఈ మొత్తాన్ని చెల్లించడంలో అనిల్ విఫలమయ్యారు. దీంతో చైనా బ్యాంకులు మరోసారి బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించాయి.
ఒక్క పైసా లేదు.. నగలు అమ్మి లాయర్ ఫీజు చెల్లించా..
RELATED ARTICLES