సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత కబీర్ సింగ్ అనే సినిమా రీమేక్ చేశారు. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. యానిమల్ సినిమా పై చాలా విమర్శలు కూడా వచ్చాయి. యానిమల్ సినిమాలో చాలా హింస, అసభ్యకరమైన సంభాషణలు ఉన్నాయని చాలా మంది విమర్శలు చేశారు. కానీ ఈ సినిమా బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ యానిమల్ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే నిర్మాతల మధ్య విభేదాలు రావడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ రాలేదు. దాంతో యానిమల్ సినిమా ఓటీటీకి వస్తుందా రాదా అని అనుమానాలు మొదలయ్యాయి. యానిమల్ సినిమాను జనవరి 26న స్ట్రీమింగ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. కానీ దాంట్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు యానిమల్ సినిమా ఓటీటీకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. అనుకున్న తేదీకే అంటే జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా యానిమల్ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అంతే కాదు కొన్ని అదనపు సన్నివేశాలను కూడా యాడ్ చేయనున్నారు. యేటర్లలోనే ఈ సినిమా 3 గంటల 21 నిమిషాలతో ఉంది. ఇక ఇప్పుడు మరికొన్ని సన్నివేశాలను కూడా యాడ్ చేయనున్నారట. రష్మిక మందన్నకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను థియేట్సర్ లో డిలీట్ చేశారు. ఇప్పుడు ఆ సన్నివేశాలను యాడ్ చేయనున్నారట.