ఇదే నిజం, కుత్బుల్లాపూర్: తెలంగాణా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం కైలాష్ హిల్స్ కు చెందిన గంగుల అంజలి యాదవ్ ను తెలంగాణ ప్రదేశ్ మహిళాసేవాదళ్ సెక్రటరీ గా నియమించారు. ఈ మేరకు గురువారం నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ప్రభావితం చేసి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్లమెంట్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దనోళ్ల సజీవ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.