ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో “హైదరాబాద్ రైజింగ్” ఉత్సవాలు నిర్వహించారు. ఈ విజయోత్సవాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దెశం అని అన్నారు. గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం ఇంకో 15 వేల ఎకరాలు భూమి కావాలి దానికి రైతులు సహకరించి భూములు ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీని న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలలో పోటీ పడే విధంగా కడతాం అని అయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపు 29% అభివృద్ధి చెందింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం దగ్గర 250 ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, డైరీ, మాంసం మార్కెట్లు కడతాం అని తెలిపారు.