ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ REDMI మరో బడ్జెట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 14C పేరిట తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్ అమర్చారు. అలాగే 6.88 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, వెనుకవైపు 50 ఎంపీ కెమెరా, ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 5160 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇక ధర విషయానికొస్తే 4GB, 64GB వేరియంట్ ధర రూ.9,999గా ఉంది.