Homeహైదరాబాద్latest Newsథాయిలాండ్‌లో మరో అయోధ్య.. ప్రత్యేకత ఏంటంటే?

థాయిలాండ్‌లో మరో అయోధ్య.. ప్రత్యేకత ఏంటంటే?

భారత్ లోనే కాకుండా థాయిలాండ్ దేశంలోనూ ఒక అయోధ్య ఉంది. ఈ నగరాన్ని అక్కడ ఆయుతయ అని పిలుస్తారు. ఈ ప్రాంతానికి అయోధ్యకు దగ్గరి పోలికలున్నాయి. అయుతయ రాజవంశంలోని ప్రతి రాజునూ శ్రీరాముని అవతారంగా కొలుస్తారు. రాజుల పేరులో రామ అనే పదాన్ని చేర్చుకోవడం ఇక్కడి తరతరాల సంప్రదాయం. థాయ్ ప్రజలు ఆనాటి నుంచే శ్రీరామున్ని పూజించేవారని తెలుస్తోంది. శ్రీ రాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన “భూమిబల్ అతుల్య తేజ్” అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు. అక్కడ అడుగడుగున రామరాజ్యమే కనిపిస్తుంది. థాయిలాండ్ వెళ్లిన భారతీయ యాత్రికులకు ఈ ఆయుతయ నగరం అయోధ్యను చూసిన భావన కలిగేలా చేస్తుంది.

ఈ నగరాన్ని 1351లో రామతిబోడి అనే రాజు స్థాపించాడు. నాలుగు శతాబ్దాలకు పైగా ఆయుతయ నగరం థాయిలాండ్ కు రెండవ రాజధానిగా కొనసాగింది. రామాయణం ఆదారంగా ఆయుతయ మొదటి పాలకుడు రామతిబోడి ఈ నగరానికి ఆ పేరు పెట్టినట్టు చరిత్రకారులు తెలిపారు. హిందూ ఇతిహాసాల్లోని రామాయణంలాగే థాయ్‌లాండ్‌ రామాయణం పేరు రామకియాన్‌. దీన్ని 18వ శతాబ్దంలో.. కింగ్‌ రామ ఒన్ రచించారని నమ్ముతారు. అక్కడ ఉన్న బౌద్ధ మిషనరీలు రామాయణాన్ని రామకీన్ అనే పేరుతో థాయిలాండ్ భాషలోకి అనువదించాయి. అయుతయ నగరాన్ని 1767లో బర్మా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. మరి రామ భక్తులకు తెలియని రామరాజ్యంగా వెలుగొందుతున్న థాయ్ లాండ్ లోని ఆయుతయ నగరం చూడడానికి రెండు కళ్ళు చాలవు.

Recent

- Advertisment -spot_img