ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇటీవల మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన హస్తం గూటికి చేరి రెండు రోజులు గడవకముందే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారు పార్టీ వీడారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంజయ్ కుమార్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.