Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి మాధవరం జంప్..?

బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి మాధవరం జంప్..?

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నట్టు తెలుస్తోంది. మాధవరం కృష్ణారావు టీడీపీ నేపథ్యం నుంచి ఎదిగిన లీడర్. లో ప్రొఫైల్ మెయింటేన్ చేసే ఈ ఎమ్మెల్యే అనతికాలంలోనే వేల కోట్లకు పడగెత్తారన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకు అత్యంత దగ్గరి వ్యక్తిగానూ ముద్ర ఉంది. ఆయన రాయబారంతోనే ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు టాక్. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నుంచి పెద్దగా చేరికలు లేవు. మాధవరం చేరితో మళ్లీ జంపింగ్స్ పర్వానికి తెరలేస్తుందేమో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img