Homeహైదరాబాద్latest Newsఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో భారీ షాక్.. ఇప్పట్లో బయటికి రావడం కష్టమేనా?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో భారీ షాక్.. ఇప్పట్లో బయటికి రావడం కష్టమేనా?

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్‌లో ఉండగా, ఈ రోజు ఆయన కస్టడీని కోర్టు 14 రోజులు పొడిగించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మే 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్‌ను కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇదే కేసులో అరెస్టయిన కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మే 7 వరకూ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. అప్పటి వరకు వారిద్దరూ తీహార్ జైలులోనే ఉండనున్నారు. అయితే కవిత బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అది కేసు పురోగతిపై ప్రభావం చూపుతుందని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. ఆమె అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని కోర్టుకు వివరించారు. మరోవైపు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఎలాంటి అంశాలు జోడించలేదని కవిత తరఫు న్యాయవాది తెలిపారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆరోపిస్తున్నారు.. కానీ కొత్తగా ఏమీ చెప్పడం లేదని కవిత తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img