బీఆర్ఎస్ వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ గూటికి చేరేందుకు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సిద్ధమైయ్యారు. కాంగ్రెస్ కండువా కప్పుకునే యోచనలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6,7 తేదీల్లో కాంగ్రెస్ పార్టీలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరే ఛాన్స్ ఉంది. గద్వాల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లోకి కృష్ణమోహన్ రెడ్డి వెళ్లబోతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో మంత్రి జూపల్లిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిశారు. దీంతో కాంగ్రెస్‌లో కృష్ణమోహన్ రెడ్డి చేరిక దాదాపుగా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.