తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ ఖాళీ సీట్ల భర్తీకి స్పెషల్ డ్రైవ్ ఫేజ్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్ సీట్లు రానివారు డిగ్రీలో చేరేందుకు వీలుగా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. రూ.400తో ఈనెల 9 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 11న సీట్ల కేటాయింపు, 11-13 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, 12, 13న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.