ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతడిని హాజరుపరచగా.. వాదనలు విన్న కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.