హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్‌కు కొరియర్ ద్వారా పంపిస్తున్న ఇద్దరిని డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. బ్యాగులో రూ. 60 లక్షల విలువ చేసే 3 కిలోల ఎఫెడ్రిన్/సూడోఎఫెడ్రిన్ ప్యాకెట్లను గుర్తించారు. ఈ ముఠా వెనుక ఉన్న వారిని తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.