Homeహైదరాబాద్latest Newsమరో ఇంజినీరింగ్ అద్భుతం.. ఆకాశాన్ని తాకే వంతెన.. గంట ప్రయాణం ఒక్క నిమిషంలోనే..!

మరో ఇంజినీరింగ్ అద్భుతం.. ఆకాశాన్ని తాకే వంతెన.. గంట ప్రయాణం ఒక్క నిమిషంలోనే..!

చైనాలోని గుయ్‌ఝౌ ప్రాంతంలో బీపన్ నదిపై నిర్మితమైన హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా రికార్డు సృష్టించనుంది. 2022లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణం కేవలం మూడేళ్లలో పూర్తయింది. 2050 అడుగుల ఎత్తుతో, ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్లు ఎత్తైన ఈ వంతెన రూ.2400 కోట్ల వ్యయంతో నిర్మితమైంది. 2890 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జి గంటల ప్రయాణాన్ని ఒక నిమిషంలో పూర్తి చేస్తుంది. జూన్ 2025లో ప్రారంభం కానున్న ఈ ఇంజినీరింగ్ అద్భుతం గుయ్‌ఝౌలో రవాణా, పర్యాటక రంగాలను విప్లవాత్మకంగా మార్చనుంది.

Recent

- Advertisment -spot_img