Homeహైదరాబాద్latest Newsరైతులకు మరో శుభవార్త.. రైతుభరోసా పై ప్రభుత్వం కసరత్తు.. త్వరలో అకౌంట్లో డబ్బులు జమ..!

రైతులకు మరో శుభవార్త.. రైతుభరోసా పై ప్రభుత్వం కసరత్తు.. త్వరలో అకౌంట్లో డబ్బులు జమ..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. కావున ఈ నెల 14 నుంచి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఏం చేశారని పదే పదే ప్రశ్నిస్తున్న వారికి ధీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాది కాలంలో ఎన్నో పథకాలు అమలు చేశామని చెప్తున్న సీఎం రేవంత్ సర్కార్.. దాదాపు 22 లక్షల మంది రైతులకు 18000 కోట్ల రుణాలను మాఫీ చేశారు. త్వరలో మరో 13 వేల కోట్లు రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇంత చేసిన తర్వాత కూడా రైతుల విషయంలో ఓ అపవాదు వెంటాడుతోందని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. అదే రైతు భరోసా.. అధికారంలోకి వస్తే 15వేలు ఇస్తామని చెప్పారు. కానీ ఏడాది గడిచినా ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీనితో ఒక ఎకరం నుండి ప్రారంభించి, డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం సమగ్ర కుల గణన సర్వేలో ఒక్కో కుటుంబానికి ఎంత భూమి ఉందనే వివరాలను అధికారులు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సర్వే పూర్తయిన తర్వాత 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులను గుర్తించి.. సాగు చేసిన భూమికి మాత్రమే రెండు విడతలుగా ఎకరానికి రూ. 7,500 భరోసా కింద ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img