తెలంగాణ రేషన్ కార్డుదారులకు మరో శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది. ఉగాది రోజున సూర్యాపేటలోని మట్టపల్లి ఆలయం నుండి సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని ద్వారా 2 కోట్లకు పైగా లబ్ధిదారులకు 6 కిలోల సన్న బియ్యం అందుతాయి. ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాలలో సన్న బియ్యం అందించబడుతుంది.