రేషన్ కార్డుదారులకు మరో శుభవార్త..పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోబోతోంది. త్వరలో రేషన్ షాపుల ద్వారా వస్తువుల కిట్ అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ అభయహస్తం పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ హయాంలో ‘అమ్మహస్తం’ పేరుతో 9 రకాల వస్తువులను రేషన్‌లో అందించేవారు. వీటిలో పప్పులు, పామాయిల్, గోధుమ పిండి, చక్కెర, ఉప్పు, చింతపండు, మిరపకాయ, పసుపు, కిరోసిన్ ఉన్నాయి.