తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పోలీస్ సిబ్బంది పిల్లల చదువు కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.