విశ్వబ్రాహ్మణ కులాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోని ఉపకులాలన్నింటిని కలిపి ఒకటిగానే పరిగణిస్తామని హైకోర్టుకు నివేదించింది. సర్వేలో వేర్వేరు సబ్ కేటగిరీలుగా ఉన్నా, ఒకే కులంగా తీసుకుంటామని పేర్కొంది. కాగా విశ్వబ్రాహ్మణులను వేర్వేరు కులాలుగా పరిగణించడంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ మేరకు వివరణ ఇచ్చింది.