తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు EAPCET, NEET, JEE వంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం శిక్షణనివ్వాలని నిర్ణయించింది. తెలంగాణలో 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా.. వాటిలో ఏటా 80 వేల మంది ఫస్టియర్లో చేరుతున్నారు. వీరు EAPCETలో ఉత్తీర్ణత సాధించి బీటెక్, బీ ఫార్మసీ వంటి కోర్సుల్లో చేరితే ప్రభుత్వం పూర్తి రీయింబర్స్మెంట్ చేస్తోంది. ఈ ఏడాది నుంచే దీనిని అమలు చేయనుంది.