రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రూ.50 కోట్లతో నూలు (యార్న్) డిపో ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చేనేత సహకార సంఘం(టెస్కో) దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని ఆదేశించింది. టెస్కో ఇకపై పరపతి (క్రెడిట్) విధానంలో కార్మికులకు నూలు సరఫరా చేస్తుంది. దీంతో 30 వేల మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.