కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న విషయం మనకు తెలిసిందే.. తాజాగా రేవంత్ సర్కార్ మరో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను రద్దు చేసి.. కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ముందు నుంచి చెప్తూ వస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి ఆర్వోఆర్ (ROR) చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు పొంగులేటి ప్రకటించారు. అయితే.. ఈ కొత్త చట్టాన్ని ఈ నెలాఖరులోగా అమల్లోకి తీసుకురానున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.