ఇదే నిజం, కుత్బుల్లాపూర్: ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని సిరిపురం అనుష (17) సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాచుపల్లి నారాయణ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం నాగిరెడ్డి పల్లి గ్రామం, కోహీర్ మండలం, సంగారెడ్డి జిల్లాకు చెందిన సిరిపురం అనుష హైదరబాద్ బాచుపల్లి లోని నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. యదావిధిగా దసరా సెలవులు ముగించుకుని ఆదివారం కాలేజీకి వచ్చింది. అయితే ఆదివారం రాత్రి కళాశాల గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కళాశాల వద్దకు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు చేరుకుని కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్య వల్లే అనుష ఉరివేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.