Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన

సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన

హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దూరాన్ని తగ్గిస్తామని చెప్పారు. బెల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్లు ఉంటుందని సీఎం వెల్లడించారు.

ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. అంతేకాదు.. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రోను పొడిగిస్తామని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు పొడిగిస్తామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img