తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మరో కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. శ్రీరామనవమి తర్వాత మరో శుభవార్త వింటామని ఆయన అన్నారు. శ్రీరామనవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని అన్నారు. రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారులను హెచ్చరించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఇందిరమ్మ పాలనలో ఏ రైతుకూ అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరైనట్లు సమాచారం. శ్రీరామనవమి తర్వాత ఈ పనులు మరింత ఊపందుకోవచ్చు.