ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం రుణాలు అందిస్తుంది. మొదటి దశలో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో 124 మందికి ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. ఇందులో పునాదులు వేసుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న 33 మందికి ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ద్వారా రూ.లక్ష చొప్పున వడ్డీ లేని రుణాలను అందజేశారు. ప్రభుత్వం మొదటి విడతలో లబ్ధిదారులకు జమచేసే రూ. లక్షను వీరు ఐకేపీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.