Homeహైదరాబాద్latest Newsఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం.. తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం.. ఎంతంటే?

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం.. తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం.. ఎంతంటే?

  • రైతు బజార్లలో విక్రయం
  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • కందిపప్పు మీద 10 రూపాయలు తగ్గింపు.. బియ్యంపై రూపాయి మాత్రమే

ఇదేనిజం, ఏపీ బ్యూరో: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. బహిరంగ మార్కెట్ లో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో తక్కువ ధరకే రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నది. మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఏపీలో బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు, బియ్యం ధరలు మండిపోతున్నాయని.. వాటిని తగ్గించేందుకు నిర్ణయించారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.160 ఉండగా.. రూ.150కీ విక్రయిచనున్నారు. బియ్యం రూ.48 నుంచి రూ.47కీ, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.48కీ తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి విక్రయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img