మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచు కొని ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాకు ఒక మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం కోఆపరేటివ్, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీఏసీఎస్, మార్కెటింగ్ యార్డుల్లో సంస్థాగతంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.