Homeహైదరాబాద్latest Newsపొంచి ఉన్న మరో ముప్పు.. మరో అల్పపీడనం.. ఉరుములతో కూడిన భారీ వర్షాలు..!

పొంచి ఉన్న మరో ముప్పు.. మరో అల్పపీడనం.. ఉరుములతో కూడిన భారీ వర్షాలు..!

అండమాన్ సముద్రం దక్షిణ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారానికి తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ చెప్పింది. గాలి వేగం కూడా ఎక్కువే. అంటే.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. 17, 18 తేదీల్లో కోస్తాంధ్ర, ఏపీలోని రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే 15, 16, 17, 18 తేదీల్లో కోస్తా ఆంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం కురుస్తాయని తెలిపారు. అలాగే 17, 18 తేదీల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

Recent

- Advertisment -spot_img