Homeహైదరాబాద్latest Newsపొంచి ఉన్న మరో ముప్పు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!

పొంచి ఉన్న మరో ముప్పు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 15 వరకు ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.

Recent

- Advertisment -spot_img