Homeహైదరాబాద్latest Newsమరో అల్పపీడనం.. ఈ జిల్లాలో భారీ వర్షాలు.. మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ..!

మరో అల్పపీడనం.. ఈ జిల్లాలో భారీ వర్షాలు.. మరో బాంబు పేల్చిన వాతావరణ శాఖ..!

అండమాన్ సముద్రం దక్షిణ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మంగళవారం తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గాలి వేగం కూడా ఎక్కువగా ఉంటుందని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రేపు ప్రకాశం, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, బుధవారం తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Recent

- Advertisment -spot_img