‘జెర్సీ’ లాంటి సినిమాతో డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఇక ఇదే సినిమాను బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నాడు. అయితే జెర్సీ వచ్చి 5 సంవత్సరాలు అయిన గౌతమ్ నుంచి ఇంకో సినిమా రాలేదు. గత ఏడాది టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో గౌతమ్ VD12 అంటూ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఒకవైపు విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అవుతుంది. అయితే ఈ గ్యాప్‌లో గౌతమ్ తిన్ననూరి తన తాజా ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. తన దర్శకత్వంలో వచ్చే నెక్స్ట్ మూవీ ‘మ్యాజిక్’ అంటూ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ ఫస్ట్ లుక్ గమనిస్తే.. సంగీతం నేపథ్యంలో ఈ సినిమా రానుండగా కొత్త నటి నటులతో ఈ సినిమా తీయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తుండగా.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో 2024 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు