Homeహైదరాబాద్latest Newsమరో మలయాళీ ముద్దుగుమ్మ ఎంట్రీ

మరో మలయాళీ ముద్దుగుమ్మ ఎంట్రీ

మాలీవుడ్‌ లేటెస్ట్ సెన్సేషన్ ‘ప్రేమలు’ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతోంది. నస్లెన్, మమిత బైజు జంటగా నటించిన ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ మార్చి 8న తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమాను ప్రమోట్ చేస్తూ హైదరాబాద్‌లో పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది మూవీ టీమ్. ఈ సందర్భంగా హీరోయిన్ మమిత తన టాలీవుడ్ ఎంట్రీపై ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయింది. “టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే నాకు ముందు తెలుగు బాగా నేర్చుకోవాలని ఉంది. అప్పుడే స్క్రిప్ట్‌ను బాగా అర్థం చేసుకొని మంచి పెర్ఫామెన్స్‌ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తెలుగులో మంచి రోల్స్ చేయాలని నాకు ఉంది.” అంటూ మమిత చెప్పుకొచ్చింది. ప్రేమలు సినిమా రిలీజైన దగ్గరి నుంచి ఈ చిత్రం గురించి అలానే మమిత గురించి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా మమితకి అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఆమె టాలీవుడ్ ఎంట్రీకి కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ప్రేమలు తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యాక ఈ బ్యూటీకి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ హీరోయిన్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి పెద్ద ఫ్యాన్. సాధారణంగానే మాలీవుడ్‌లో బన్నీకి సూపర్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. కానీ పుష్ప సినిమాతో అది డబుల్ అయింది. కానీ మమిత తాను ఎప్పటి నుంచో అల్లు అర్జున్‌‌కి పెద్ద ఫ్యాన్ అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఆయన సినిమాలు మిస్ అవ్వకుండా చూస్తానని ప్రతీ చిన్న డిటైల్ ఇంటర్వ్యూలో చెప్పింది. అలానే ప్రేమలు మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరిగిన సమయంలో బన్నీ ఇంటి ముందు నుంచే ట్రావెల్ చేసినట్లు కూడా చెప్పుకొచ్చింది. ఒక్కసారైనా బన్నీ కనిపిస్తారేమోనని ఎదురుచూసినట్లుగా చెప్పింది. ఈ ఇంటర్వ్యూ వీడియోలను బన్నీ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ బ్యూటీకి అల్లు అర్జున్‌తో వర్క్ చేసే ఛాన్స్ దొరకొచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Recent

- Advertisment -spot_img