నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా వై.వి.ఎస్.చౌదరి కొత్త సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారక రామారావును జూనియర్ ఎన్టీఆర్ అభినందిస్తూ బుధవారం ట్వీట్ చేశారు. ‘మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మీకు మన పెద్దవాళ్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. వారి ఆశీస్సులతో మీరు ఉన్నత శిఖరానికి చేరుకుంటారని నాకు నమ్మకం ఉంది’ అని అన్నారు.