వాట్సాప్ లో మరో ఫీచర్ రానుంది. వాట్సాప్ లో ‘అకౌంట్ రెస్ట్రిక్షన్’ పేరిట ఈ ఫీచర్ అందుబాటులోనికి రానుంది. దీని ద్వారా అనుమానాస్పదంగా, హానికరంగా వ్యవహరించే ఖాతాలను వాట్సాప్ నియంత్రిస్తుంది. రెస్ట్రిక్ట్ అయిన అకౌంట్ నుంచి కొత్త వారికి మెసేజ్ లు పంపడానికి వీలుండదు. ఆల్రెడీ చాట్ చేసిన వారికి మెసేజులు, కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది.