తెలంగాణవాసులకు South Central Railway గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో మరో కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల మీదుగా ఈ ట్రైన్ లైన్ ఏర్పాటు కానుంది. సౌత్ సెంట్రల్ రైల్వే(ఎస్‌సీఆర్) గతేడాది మంజూరుకు ప్రతిపాదించిన డోర్నకల్-గద్వాల రైలు మార్గానికి దాదాపుగా మార్గం సుగమైంది. రైలు మార్గం నిర్మాణానికి అవసరమైన తుది సర్వే ముమ్మరంగా సాగుతోంది.