Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్..!

తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్..!

తెలంగాణకు మరో కొత్త రైల్వే లైన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే.. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే మార్గం పనులు శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు మరో కొత్త రైల్వే లైన్ మంజూరు కావటంతో.. తెలంగాణ వాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ కొత్త రైల్వే లైన్.. తెలంగాణ, ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్‌లోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ నిర్మించబోతున్నట్టు సమాచారం. ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు సుమారు 200.60 కిలోమీటర్ల దూరం ఈ కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించనున్నారు. అయితే.. ఈ కొత్త మార్గాన్ని రూ.4,109 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Recent

- Advertisment -spot_img