తెలంగాణలో మరో కొత్త రహదారి అందుబాటులోకి రానుంది. ఆ గ్రామాలకు మహర్దశ పట్టనుంది. శంషాబాద్ ఎయిర్పోర్టు -స్కిల్ యూనివర్సిటీ- రీజినల్ రింగు రోడ్డు కనెక్ట్ చేసేందుకు ఈ రోడ్డు నిర్మిస్తున్నారు. దాదాపు 40 కి.మీ మేర ఈ రహదారిని తలపెట్టారు. హైదరాబాద్ శివారు రావిర్యాల నుంచి ఆమన్గల్ మండలం ఆకుతోటపల్లి వరకు పలు గ్రామాల మీదుగా రోడ్డు నిర్మిస్తారు. అక్కడి భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు మహర్దశ పట్టనుంది.