New scheme: ఏపీలో జనవరి 18 నుంచి వాట్సప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభంతో ప్రజలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కుల ధ్రువీకరణ పత్రం, పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం, అడంగల్, నేటివిటీ సర్టిఫికేట్లు వంటి 150 రకాల సేవలు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఈ ప్రక్రియ ప్రజల సమయాన్ని ఆదా చేస్తుంది. సేవల సరళతను పెంచుతుంది.