డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో UPI చెల్లింపులదే అగ్రస్థానం. ఇప్పటికే పలు UPI యాప్‌లు యూజర్లకు సేవలందిస్తున్నాయి. ఇప్పుడీ పోటీలోకి మరో యాప్ వచ్చింది. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పించేలా ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాం భారత్‌పే తాజాగా యూపీఐ TPAPని (థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) ఆవిష్కరించింది. ఇందుకోసం యూనిటీ బ్యాంకుతో జట్టుకట్టినట్లు తెలిపింది.