తెలంగాణలో తప్పుడు పత్రాలతో చేసిన రూ.288 కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు 350 మంది డీలర్లతో కలసి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను దోపిడీ చేశారు. జగిత్యాల కేంద్రంగా ఓ జీఎస్టీ కన్సల్టెంట్ 32 సూట్ కేసు కంపెనీలు తెరచి.. వ్యాపారం చేయకుండానే చేసినట్లు కాగితాలపై చూపి భారీ మొత్తంలో ఐటీసీ నొక్కేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాదిన్నరపాటు ఓ ట్యాక్స్ కన్సల్టెంట్ చేసిన వ్యవహారాన్ని జీఎస్టీ అధికారులు ఆలస్యంగా గుర్తించారు.