తెలంగాణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందజేసే సీఎం రిలీఫ్ ఫండ్ లో అక్రమాలు జరిగినట్లు సీఐడీ తాజాగా గుర్తించింది. రోగులకు వైద్యం అందించకుండా నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్‌ఎఫ్ నిధులను స్వాహా చేసినట్లు సీఐడీ నిర్ధారించింది. సీఐడీ అధికారులు పలు ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మొత్తం 30 ప్రైవేట్ ఆసుపత్రులపై సీఐడీ ఆరు కేసులు నమోదు చేసింది. బీఆర్‌ఎస్ హయాంలో గతేడాది ఏప్రిల్‌కు ముందు కూడా ఈ రాకెట్ కొనసాగిందని సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.